CM KCR letter to PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొద్దిరోజుల క్రితం ధాన్యం  కొనుగోలు అంశంపై ప్రధానికి లేఖ రాసిన సీఎం... తాజాగా ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్థులు తమ చదువును ఇక్కడ కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని లేఖ ద్వారా ప్రధానిని కోరారు. దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఇండియాకు తిరిగొచ్చారని... దాదాపుగా అంతా మెడికల్ విద్యార్థులేనని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని.. అలా జరగకుండా దేశంలోని వైద్య కళాశాలల్లో వారికి సీట్లు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన 700 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారని... వీరందరి విద్యకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. దీనిపై కేంద్రం కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడే సూచనలు కనిపించట్లేదు. దీంతో వైద్య విద్యార్థులు ఇప్పట్లో తిరిగి ఉక్రెయిన్ వెళ్లి విద్యను కొనసాగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌లోనే వారు తమ విద్యను కొనసాగించేందుకు అనుమతినివ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ చేసిన ఈ విజ్ఞప్తిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 


Also Read: Jana Gana Mana: 'జన గణ మన' కథ ఎలా ఉండబోతుందో చెప్పిన పూరి జగన్నాథ్...


Viral News: 74 ఏళ్ల ఈ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌కి ఫిదా అవాల్సిందే... ఆ ఫ్లూయెన్సీ ఎలా వచ్చిందంటే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook