Auto Driver Impeccable English: ఎవరితోనైనా నాలుగు ముక్కలు ఇంగ్లీష్‌లో మాట్లాడితే.. అదరగొట్టేశామని లోలోపల ఫీలయ్యేవాళ్లు ఎంతోమంది ఉంటారు. ఎవరైనా ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడితే.. అబ్బా ఏం మాట్లాడాడ్రా అనుకుంటారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారో లేక కూలీ నాలీ చేసుకునే కష్టజీవులో ఇలా ఇంగ్లీషులో ఇరగదీస్తే మరింత ఆశ్చర్యపోతారు. బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇలాగే ఇంగ్లీషులో ఇరగదీయడంతో ఆశ్చర్యపోవడం ఓ మహిళా టెకీ వంతైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన లింక్డ్‌ఇన్ పోస్టు ద్వారా వెల్లడించారు.
నికితా అయ్యర్ అనే ఆ మహిళ తన లింక్డెన్ పోస్టులో తెలిపిన వివరాల ప్రకారం... ఎప్పటిలాగే ఇటీవల ఓరోజు ఉదయాన్నే ఆమె ఆఫీసుకు బయలుదేరింది. అప్పటికే ఆలస్యమవడంతో ముఖంలో కాస్త ఆందోళన కనిపిస్తోంది. రోడ్డుపై నిలబడి ఉన్న ఆమె వద్దకు ఓ ఆటో డ్రైవర్ వచ్చి.. ఎక్కడికెళ్లాలి మేడమ్.. ఆటో ఎక్కండి.. ఎంతిస్తారో ఇవ్వండి అంటూ ఇంగ్లీషులో అడిగాడు. అతను ఇంగ్లీషులో అడిగిన విధానం చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
ఆటోలో ఎక్కాక దాదాపు 45 నిమిషాల పాటు అతనితో ముచ్చటించింది. ఆ సంభాషణంతా ఇంగ్లీషులోనే సాగింది. ఒకప్పుడు తాను ఇంగ్లీష్ లెక్చరర్‌ని అని.. ఎంఏ, ఎంఈడీ చదువుకున్నానని సదరు డ్రైవర్ ఆమెతో చెప్పాడు. కర్ణాటకలో ఎక్కడ జాబ్ దొరక్క అప్పట్లో ముంబై వెళ్లినట్లు చెప్పాడు. కర్ణాటకలో జాబ్ కోసం వెళ్లిన ప్రతీసారి తన కులం గురించి అడిగేవారని.. తన పేరు పట్టాభి రామన్ అని చెప్పగానే.. తిప్పి పంపేవారని తెలిపాడు. దాంతో ఇక ముంబై వెళ్లి అక్కడ ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరినట్లు తెలిపాడు.
అక్కడ 20 ఏళ్ల పాటు ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాక.. మళ్లీ కర్ణాటక వచ్చేసినట్లు చెప్పాడు. లెక్చరర్‌గా ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తే మహా అయితే రూ.15 వేలు ఇస్తారని... అదే ఆటో నడిపితే రోజుకు రూ.700-రూ.1500 వస్తాయని తెలిపాడు. అందుకే ఆటో నడుపుతున్నానని.. ఆటో నడిపితే వచ్చే డబ్బు తనకు, తన గర్ల్‌ఫ్రెండ్‌కి సరిపోతాయని చెప్పాడు. గర్ల్‌ఫ్రెండ్ ఎవరని అడిగితే తన భార్య అని నవ్వుతూ చెప్పాడు. 74 ఏళ్ల వయసులోనూ తన కొడుకుపై ఆధారపడవద్దనే ఉద్దేశంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పాడు.
పట్టాభి రామన్ స్టోరీని నికితా అయ్యర్ తన లింక్డ్‌ఇన్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 'జీవితం పట్ల ఎలాంటి కంప్లైంట్స్ లేవు.. విచారపడేదేమీ లేదు.. ఇలాంటి హీరోల నుంచి నిజంగా చాలా నేర్చుకోవచ్చు.' అని నికితా అయ్యర్ తన పోస్టులో పేర్కొన్నారు.
Also Read: Jana Gana Mana: జన గణ మన... విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్...
Also read: Video: లాంగ్ గ్యాప్ తర్వాత షూటింగ్ సెట్‌లోకి సాయి ధరమ్ తేజ్... ఎమోషనల్ అయిన మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook