CM KCR appeal to Unemployed Youth: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు. బుధవారం (మార్చి 9) ఉదయం 10 గంటలకు నిరుద్యోగులంతా టీవీలు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏవిధమైన తెలంగాణ ఆవిష్కారమైందో.. ఏ ప్రకటన చేయబోతున్నామో నిరుద్యోగులు చూడాలన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటనపై తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రేపు అసెంబ్లీలో కేసీఆర్ ఏం ప్రకటించబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా బడ్జెట్‌లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంశాల ప్రస్తావన లేకపోవడంతో నిరుద్యోగులకు దీనివల్ల ఒరిగిదేమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై అదిగో.. ఇదిగో.. అంటూ ప్రకటనలకే పరిమితమవుతూ వచ్చింది తప్ప.. ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడం కానీ, నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ చేయలేదు. దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుంది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. నిరుద్యోగుల్లో అసంతృప్తిని చల్లార్చే చర్యలకు ప్రభుత్వం సిద్ధపడినట్లు సీఎం తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది.


బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్ :


ఇదే వనపర్తి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. బుద్ది తక్కువ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని బలిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మతపిచ్చి లేపి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సమాజం ఆ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. తన కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణలో ఆ అరాచక పరిస్థితి రానివ్వనని అన్నారు. తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడినమో.. దేశం కోసం కూడా తెలంగాణ పోరాడాలన్నారు. దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు.. అవసరమైతే తన ప్రాణాలైనా అర్పిస్తానని వ్యాఖ్యానించారు. బీజేపీ మతపిచ్చి పార్టీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు.



Also Read: BJP MLA's Suspension: కేసీఆర్ దిష్టిబొమ్మకు నడిరోడ్డులో ఉరి... కేటీఆర్ ఇలాఖాలో బీజేపీ నిరసన


Also Read: Trending News: సోషల్ మీడియా చేసిన సెలెబ్రెటీ- మోడల్​గా మారిన బొమ్మలు అమ్మే యువతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook