Munugode Byeelction:  తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఉప సమరంలో ఊహించని ట్విస్టులు నెలకొంటున్నాయి. అసమ్మతి గళంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగమాగమవుోతంది. ఓ వైపు ఈనెల 20న మునుగోడులో  సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. అసమ్మతి నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో మునుగోడు విషయంలో సీఎం కేసీఆర్ ప్లాన్ మార్చారని అంటున్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ మంత్రి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖరారైందని ప్రచారం సాగుతున్నా.. తాజాగా పరిణామాలతో మళ్లీ సీన్ మారిందనే చర్చ సాగుతోంది. అభ్యర్థితో సంబంధం లేకుండా మునుగోడు బహిరంగ సభ సక్సెస్ పై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసిందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం సభ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను రంగంలోకి దింపింది టీఆర్ఎస్ అధిష్టానం. నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్లతో సంబంధం లేకుండా పార్టీ జిల్లా నాయకత్వమే మునుగోడు సభ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. గ్రూప్ విభేదాలను పక్కన బెట్టి ఈనెల 20న సీఎం సభను విజయవంతం చేసేలా ప్రయత్నాలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మండలాల వారీగా ఎమ్మెల్యేలను నియమించింది హైకమాండ్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మునుగోడులో పర్యటిస్తూ ముఖ్యమంత్రి సభను సక్సెస్ చేసేందుకు నేతలు శ్రమిస్తున్నారు. కూసుకుంట్లను పక్కన పెట్టడంతో అసమ్మతి నేతలు కూడా కేసీఆర్ సభ కోసం ఉత్సాహంగా జనసమీకరణ చేస్తున్నారని అంటున్నారు.


మరోవైపు నియోజకవర్గంలోని గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ హైకమాండ్ చర్యలు చేపట్టింది. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా నియమించింది. వాళ్లంతా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. చౌటుప్పల్ మండల పార్టీ సమావేశం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యవేక్షణలో జరిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.. మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మునుగోడు, చండూరు మండలాల్లో పర్యటించారు. సీఎం సభకు జన సమీకరణ చేస్తూనే అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్నారు గులాబీ ప్రజాప్రతినిధులు. అసమ్మతి నేతల అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు  నివేదిస్తున్నారు.


మునుగోడు ఉప ఎన్నికలో టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్ గౌడ్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఉన్నారు. శనివారం ప్రగతి భవన్ లో కంచర్ల కృష్ణారెడ్డితో దాదాపు గంట సేపు మాట్లాడారు సీఎం కేసీఆర్. దీంతో మునుగోడు విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మండలాల వారీగా నియమితులైన ఇంచార్జ్ ఎమ్మెల్యేల సర్వే ను తీసుకొని మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ లో ఈ ఐదు రోజులు కీలకంగా మారింది. ఇంచార్జ్ ఎమ్మెల్యేలు హైకమాండ్ కు ఎలాంటి నివేదిక ఇస్తారు.. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటిస్తారన్నది సస్పెన్స్ రేపుతోంది.


మునుగోడు బహిరంగ సభకు జన సమీకరణ బాధ్యతను ఇంచార్జ్ లకు అప్పగించిన సీఎం కేసీఆర్


మునుగోడు మండలం : మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి...


చౌటుప్పల్ మున్సిపాలిటీ: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్...


చౌటుప్పల్ రూరల్: హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...


మర్రిగూడ: భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి


నాంపల్లి: దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి...


చండూరు మున్సిపాలిటీ: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య...


చండూరు రూరల్: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, యాదాద్రి జిల్లా జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి


నారాయణపురం: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత


Read Also: Azadi Ka Amrit Mahotsav: భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీర వనితలు వీరే..


Read Also: Tamilnadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌కు స్టాలిన్ షాక్.. ఆనకట్టల నిర్మాణం ఆపాలని డిమాండ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook