CM KCR Election Campaign: మళ్లీ ఎన్నికలు వచ్చాయని.. పదేళ్లలో ఏం జరిగిందో  అదంతా నిలువెత్తుగా మీ కళ్ల ముందు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వనపర్తి, మునుగోడులో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతా ఉంటాయని.. కానీ ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలని అన్నారు. అప్పుడే బతుకులు బాగు పడతాయని చెప్పారు. తెలంగాణ కోసం బయలుదేరి 24 ఏళ్లు అయిందని.. నాడు ఎవరు లేరని అన్నారు. ఈ రోజు విమర్శలు చేసే వాళ్లు ఎవ్వడు ఏ చెట్టు కింద ఉన్నడో మీ అందరికి తెలుసన్నారు. ఎవ్వడి బూట్టు మోసుకుంటున్నడో మీకు తెలుసు అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెనుకబడ్డ మహబూబ్ నగర్‌లో పక్షుల్లా తిరిగామని.. పాలమూరు బాగుపడాలని తపన పడ్డామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ మొత్తం ఒక్క గొంతై నినాదిస్తే.. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2014 దాకా తెలంగాణ ఇవ్వలేదని.. పదేళ్లు ఏడిపించారని గుర్తు చేసుకున్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని.. నిధుల్లో, నియమకాల్లో అన్యాయం జరుగుతుంటే కొట్లాడింది ఎవరు..? అని ప్రశ్నించారు. ఉల్టా పల్టా మాటలు మాట్లాడే చిల్లరగాళ్లెవ్వరని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నీళ్ల చుక్కకోసం డీ8 కాలువ కోసం నిరంజన్ రెడ్డి కొట్లాడని.. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడిందని.. కాళ్లకు కట్టెలు పెట్టారని విమర్శించారు.


తెలంగాణను ఒక పూల పొదరిల్లులాగా చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని.. కర్ణాటకలో కరెంటు 5 గంటలు కూడా ఇస్తారలేరని తెలిపారు. రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణి తీసుకువచ్చామని.. అన్నదాతలకు ఎంతో ఉపయోగపడే ధరణిని తీసేస్తామని రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారని మండిపడ్డారు.  


అనంతరం మునుగోడు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడులో 90 శాతం హామీలు నెరవేర్చామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగమై ఓట్లు వేయద్దని ప్రజలను కోరారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ నీళ్ల గోస పూర్తిగా ఏ విధంగా పోయిందో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ తెచ్చిన తెల్లారి నుంచి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చామన్నారు. ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని.. తల రాత మారుస్తుందని అన్నారు. కేవలం డబ్బు మదంతో అహంకారంతో ప్రజలను కొనగలుగుతామని అంటున్నారని.. అప్రమత్తంగా ఉండాలని కోరారు.


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   


Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook