KCR inaugurates Siddipet collectorate building: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేడు సిద్దిపేట జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌, ఆధునిక సదుపాయాలతో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఆదివారం నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలెక్టర్, ఇతర కార్యాలయాలు ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రైతులు సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందని పేర్కొన్నారు. గతంలో నీటి కోసం రైతులు చాలా కష్టాలు పడ్డారని, ప్రస్తుతం ఆసమస్య లేదన్నారు. చెరువులన్నీ నీటితో నిండుకుండలా ఉన్నాయని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) పేర్కొన్నారు. అంతకుముందు సిద్దిపేటకు విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీష్ రావు ఘన స్వాగతం పలికారు. 


Also Read: Bank Timings In Telangana: రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బ్యాంకు సేవలు, బ్యాంక్ టైమింగ్స్ లేటెస్ట్ వివరాలు


సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రూ.4 కోట్ల వ్యయంతో జీప్లస్ వన్‌గా ఏకరం విస్తీర్ణంలో ఆధునాతనంగా నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, మొదటి అంతస్తులో ఎమ్మెల్యే నివాస సముదాయం ఉండేలా ఏర్పాటు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా సిద్దిపేటలో Telangana సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. హరీష్ రావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, డీజీపీ మహేందర్ రెడ్డి, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Also Read: Telangana unlock: నేటి నుంచే తెలంగాణలో అన్‌లాక్.. Corona guidelines తప్పనిసరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook