Sangameshwar and Basaveshwara projects: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) నారాయణ ఖేడ్ లో పర్యటించారు.  సింగూరు ప్రాజెక్టుపై నిర్మించ‌నున్న‌ రూ.సంగమేశ్వర (Sangameshwar), బసవేశ్వర (Basaveshwara) ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల చేపట్టడం ద్వారా నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి పొందనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) రూ.4,427 కోట్లతో చేపట్టే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా 3.87 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో 57వేల ఎకరాలు, జహీరాబాద్‌లో 1.06 లక్షల ఎకరాలు, అంధోల్‌లో 56వేల ఎకరాలు, నారాయణఖేడ్ పరిధిలో 1.65 లక్షల ఎకరాలకు రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని సింగూరుకు తరలించి అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా 4 నియోజకవర్గాలకు నీరందిస్తారు. 


ఏడాదిన్నరలోపు ప్రాజెక్టులు పూర్తి చేసేలా నేతలు కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.‘జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాలకు త్వరగా నీరందాలే నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. 


Also Read: KCR-Uddhav Thackeray: కేసీఆర్-ఉద్దవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్ మీట్.. ఏం చెప్పారంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook