హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జీహెచ్ఎంసీ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ల ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: తెలంగాణను వణికిస్తోన్న మర్కజ్ కేసులు.. ఆందోళనలో వైద్య సిబ్బంది..


కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా ఢిల్లీలోని తబ్లీఘీ జమాత్, మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని సూచించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నవారిపై సీఎం సీరియస్ అయినట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కాగా సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు వెల్లడించారు. 


Read Also: అమెరికాలో మరో మర్కజ్.. కరోనా కేసుల పెరుగుదలకు ఆ ఔషధ కంపెనీయే కారణమా?


పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..