KCR Jharkhand tour: మాది బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యతిరేక కూటమి కాదు: కేసీఆర్
KCR Jharkhand tour: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమికోసం కేసీఆర్ ప్రయత్నాల్లో మరో ముందడుకు వేశారు. తాజాగా ఝార్ఖండ్ సీఎంతో కేసీఆర్ భేటీ అయ్యారు.
KCR Jharkhand tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్య మంత్రిని కలిసి చర్చలు జరిపిన కేసీఆర్ తాజాగా.. ఝార్ఖండ్‌కు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. ముఖ్య మంత్రి అధికారిక నివాసంలోనే కేసీఆర్ హేమంత్ సోరెన్‌ల మధ్య సమావేశం జరిగింది.
చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు ఇద్దరు సీఎంలు. ఈ సందర్భంగా మెరుగైన భవిష్యత్ కోసం మొదటి అడుగు పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒకే విధమైన భావాజాలం ఉన్న శక్తులను ఒక్క చోటకు చేర్చేప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.
తమది బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ వ్యతిరేక కూటమో లేకా థార్ట్ ఫ్రంటో కాదని వెల్లడించారు కేసీఆర్. దేశ ప్రజలందరికీ మేలు చేసే ఆలోచన మాత్రమేనని స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినప్పటికీ.. ఇంకా సంపూర్ణంగా అభివృద్ధి చెందలేదన్నారు కేసీఆర్. దేశంలో ప్రతీ పౌరుడిపై దీనిని సరిదిద్ధాల్సిన అవసరముందని పేర్రకొన్నారు. దేశాన్ని కొత దిశగా, కొత్త మార్కంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆ దిశగా తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Also read: Emotional Video: భర్త సమాధి వద్ద మహిళ పెళ్లిరోజు వేడుక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!
Also read: TS Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook