Telangana: యథేచ్ఛగా యువత షికారు.. పోలీసులు ఏం చేశారో తెలుసా....
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు తీసుకుంటుంటే.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను పట్టించుకోకుండా యథేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్న
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు తీసుకుంటుంటే.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను పట్టించుకోకుండా యథేచ్ఛగా రోడ్లపై విహరిస్తున్న యువతను పోలీసులు అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
Also Read: 10 నిముషాల్లోనే ''కరోనా వైరస్'' పరీక్ష..!!
ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకున్నాయి. అయితే పలు జిల్లా కేంద్రాల్లో అరెస్టు చేసిన యువతను సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంచుతామని, ప్రజలు వైద్య, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు మాత్రమే బయటకు రావాలని, అది కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు.
Read Also: 'కరోనా'పై గాయని కరుణ హృదయం
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ నిర్వహించాలని, జనతా కర్ఫ్యూ మాదిరిగానే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రంలోని రేషన్ కార్డున్నా ప్రతి కుటుంభానికి రూ. 1500 అందించబోతున్నామని, ఇది బడ్జెట్ తో ప్రమేయం లేకుండా అందజేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారిని తరమేందుకు ఎవరికీ వారే తగిన జాగ్రతలు తీసుకోవాలని, ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని స్థానిక ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..