హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని, ఇద్దరు చనిపోయారని, చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు కోలుకుని డిశ్చార్జి అయ్యారని  వెల్లడించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 531కి చేరిందని, మరణించిన వారి సంఖ్య 16కు పెరిగిందని, డిశ్చార్జి అయిన వారి సంఖ్య 103కి చేరిందన్నారు. మిగతా 412 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


Read Also: ఆ పంచ్ కు తన ముక్కు ఎర్రగా వాచిపోయిందంటూ కేటీఆర్ కు వర్మ ట్వీట్..
 ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు మహారాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకు భయంకరంగా తయారవుతోంది.  ప్రజలు మరికొన్ని రోజులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్నసాయం, పంటల కొనుగోళ్లు జరుగుతున్న విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9.30 వరకు సాగిన సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని సీఎం సమీక్షించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..