CM KCR: హైదరాబాద్‌:  కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అలా అని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి  కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రజలకు సూచించారు.  అయితే.. కరోనా సోకిన వారు అధిక బిల్లులు చెల్లిస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంతమందికైనా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం సర్వం సంసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ( KCR ) స్పష్టంచేశారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో శుక్రవారం మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. Also read: Telangana: కాలేజీ స్టూడెంట్స్‌కూ మధ్యాహ్న భోజనం: CM KCR


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువని, కరోనా రికవరీ రేటు 67శాతం ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ప్రజలు వీలైంనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా నివారణకు అదనంగా 100కోట్లు కేటాయించామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5వేల పడకలను సిద్ధం చేసినట్లు కేసీఆర్ తెలిపారు. గాంధీ, టిమ్స్‌లో 3వేల పడకలు ఆక్సిజన్ సౌకర్యంతో అందుబాటులో ఉన్నాయన్నారు. 1500ల వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. Also read: Telangana: సెక్రటేరియట్ వ్యవహారంలో కలగజేసుకోం: సుప్రీంకోర్టు


రాష్ట్రంలో పీజీ పూర్తిచేసిన దాదాపు 1200మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి 10శాతం అదనపు వేతనం ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు పడకల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యహరించాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   Also read: IAS Sweta mohanty: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కరోనా పాజిటివ్