Telangana: కాలేజీ స్టూడెంట్స్‌కూ మధ్యాహ్న భోజనం: CM KCR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) కళాశాలల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచేందుకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. 

Last Updated : Jul 17, 2020, 07:44 PM IST
Telangana: కాలేజీ స్టూడెంట్స్‌కూ మధ్యాహ్న భోజనం: CM KCR

Mid-day meal: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) కళాశాలల విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్‌ను తగ్గించి, హాజరుశాతాన్ని పెంచేందుకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ( Mid-day meal ) ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( K. Chandrashekar Rao) శుక్రవారం ప్రకటించారు.  ఉదయం కళాశాలలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నం నాటికి ఇళ్లకు వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కళాశాలల్లో డ్రాపవుట్స్ బాగా పెరిగిపోతున్నాయని కేసీఆర్ తెలిపారు. విద్యార్థుల డ్రాపవుట్స్‌ను నివారించి, వారికి మెరుగైన పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. Also read: Telangana: సెక్రటేరియట్ వ్యవహారంలో కలగజేసుకోం: సుప్రీంకోర్టు

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల డిగ్రీ కళాశాలలో గార్డెన్, బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ ( KCR ) మాట్లాడారు. జూనియర్ కాలేజీ అధ్యాపకుడు రఘురామ్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ తెలుసుకుని సీఎం వారిని అభినందించారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం తెలిపారు. Also read: Heavy rain: రాష్ట్రంలో 3 రోజులపాటు భారీ వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు

లెక్చరర్ రఘురామ్ వినతి మేరకు సీఎం కేసీఆర్ జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని సైతం మంజూరు చేశారు. అదే విధంగా బొటానికల్ గార్డెన్‌కు కావాల్సిన 50లక్షల నిధులను కూడా మంజూరు చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను అభినందించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు జడ్చర్ల కళాశాలను ఆదర్శంగా తీసుకోని ఇలాంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ అన్ని కళాశాలల సిబ్బందికి సూచించారు.Also read: Telangana: ఇటీవల ట్రాన్స్‌ఫర్ అయిన ఐఏఎస్ఆఫీసర్స్ జాబితా

Trending News