20 లక్షల కోట్ల ప్యాకేజీ ఒట్టి డొల్ల, మోసం.. కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మానవజాతిని అతలాకుతలం చేయడంతో పాటు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఈ విపత్కర, క్లిష్ట పరిస్థితి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా (Covid-19) మహమ్మారి మానవజాతిని అతలాకుతలం చేయడంతో పాటు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఈ విపత్కర, క్లిష్ట పరిస్థితి నుండి బయట పడటానికి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది. దీనిపై సోమవారం ప్రగతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా లాంటి మహమ్మారిపై పోరు చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన (Atma Nirbhar Bharat) ప్యాకేజీ బోగస్ అని అంతా మోసం అని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read: మరోసారి హాట్ టాపిక్ అయిన రష్మీ గౌతమ్ వ్యాఖ్యలు..
కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని, కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని సీఎం ఎద్దేవా చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ ఆంక్షలు పెట్టారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీ దగా, మోసమన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ర్టాలను భిక్షగాళ్లను చేస్తారా..అని సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఇది కూడా చదవండి: Lockdown in Telangana : తెలంగాణలో లాక్‌డౌన్ 4.0 సడలింపులు ఇవే