KCR's Today's Tour Schedule: నేడు సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెట్టి మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాలవర్షాలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులకు తీవ్ర పంటనష్టం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంట నష్టం అధికంగా ఉన్న ప్రాంతాల గురించి ఓ నివేదిక తెప్పించుకున్న  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. గురువారం ఆయా జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. గురువారం సీఎం కేసీఆర్ పర్యటన వివరాలిలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం 10:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలీక్యాప్టర్ లో బయలుదేరనున్న సీఎం కేసీఆర్.. ముందుగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రామాపురానికి చేరుకుంటారు. అక్కడ స్థానిక రైతులతో సమావేశం కానున్న కేసీఆర్.. పంట నష్టం వివరాలు పరిశీలించి వారికి ప్రభుత్వం తరపున అందించే నష్టపరిహారంపై ఒక ప్రకటన చేయనున్నారు.


బోనకల్ మండలం నుండి మహాబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకోనున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించి, పంట నష్టం తీవ్రతను సమీక్షించి రైతులతో సమావేశం కానున్నారు. అనంతరం రైతులను ఆదుకునే దిశగా అక్కడి జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేయనున్నారు.


మహబూబాబాద్ జిల్లా నుండి వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం అడవి రంగాపురం చేరుకొని అక్కడి రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు సేకరించనున్నారు. వారికి ప్రభుత్వం తరపున అందించే సహాయంపై అధికారులకు ఆదేశాలు జారీచేయనున్నారు. వరంగల్ జిల్లాలో పర్యటన ముగించుకున్న అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. రామడుగు మండలంతో పాటు కరీంనగర్ జిల్లాలో జరిగిన పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం జిల్లాలో అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం బారి నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున వారికి అవసరమైన సహాయాన్ని కేసీఆర్ ప్రకటించనున్నారు.


ఇది కూడా చదవండి : Teenmar Mallanna Arrest News: చర్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న.. విషయం చెప్పిన పోలీసులు


ఇది కూడా చదవండి :  Teenmar Mallanna: కేసీఆర్.. నీకు మూడింది.. నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నవ్ బండి సంజయ్ హాట్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK