CM KCR visits MGM Hospital: వరంగల్:  సీఎం కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకే ప్రధానమైన కొవిడ్ కేర్ సెంటర్ గా సేవలు అందిస్తున్న ఎంజీఎం హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, కరోనా చికిత్స, మెడిసిన్, ఆక్సీజన్ సరఫరా, తగిన స్థాయిలో వైద్య సిబ్బంది ఉన్నారా లేరా అనే తదితర వివరాల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ నుంచి సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వార్డులో కరోనా రోగులను పరామర్శించిన సీఎం కేసీఆర్ వారికి అందుతున్న చికిత్స, వైద్య సహాయం గురించి ఆరా తీసి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్న హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ (CM KCR Warangal tour) ఒక రోజు గ్యాప్ తీసుకుని ఇవాళ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకంటే ముందుగా హెలీక్యాప్టర్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ఎంజీఎం హాస్పిటల్‌కి వచ్చారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా ఎంజీఎం హాస్పిటల్ పరిసరాల్లో జిల్లా పోలీసులు, సీఎం భద్రతా సిబ్బంది కఠిన ఆంక్షలు విధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనాతో (COVID-19) వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్స్‌తో వచ్చే అంబులెన్సులు మినహా మిగతా వారిని ఆసుపత్రిలోకి అనుమతించడం లేదని తెలుస్తోంది.


Also read : TS SSC Results 2021: తెలంగాణలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి


సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో (CM KCR warangal tour) ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఇదే పర్యటనలో సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలంలో అన్ని ఆధునిక హంగులతో ఎయిమ్స్ ఆసుపత్రి తరహాలో ఎంజీఎం ఆసుపత్రిని నిర్మించి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆసుపత్రిని (Warangal MGM hospital) అక్కడి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలులోనూ (Warangal central jail) పర్యటించనున్నారు.


Also read : తెలంగాణలో COVID-19 కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook