PM Modi Visiit To Hyderabad for Covid-19 Vaccine | భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే హైదరాబాద్‌ నగరాన్ని సందర్శించిన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పిలవాల్సింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.హైదరాబాద్‌లో డెవలెప్ అవుతున్న కోవిడ్-19 (Covid-19 Vaccine) వ్యాక్సిన్ వివరాలను పర్యవేక్షించడానికి ఇటీవలే ప్రధాని మోదీ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వీఐపీ, ప్రోటాకాల్ లిస్ట్‌లో ముఖ్యమంత్రి పేరు లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు అనేవి రాజ్యాంగం కల్పించిన పదవులు కానీ వ్యక్తిగత పదవులు కావు అని వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.



Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే


మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ( KTR ) ప్రతీ రాష్ట్రంలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అని.. వాటిని ఖచ్చితంగా పాటించాలి అని తెలిపారు. అది ప్రధాని (PM Modi) అయినా, ముఖ్యమంత్రి అయినా... గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. జాతి ప్రయోజనం కోసం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నాడు కేటీఆర్.


ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) వెళ్లి ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లడానికి సిద్ధం అయ్యారు. కానీ ఆయనకు ఆహ్వానం రాదు. కానీ ఆయన గౌరవానికి ఎలాంటి నష్టం కలగలేదు. ముఖ్యమంత్రిని ఆహ్వానించకుండా వారే గౌరవం కోల్పోయారు అని తెలిపారు.



Also Read | GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook