Harish Rao Sensational Challenge: మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తుండడం.. మూసీ నది పేరిట లక్షన్నర కోట్లతో అవినీతి చేస్తున్నారనే ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ పార్టీ ఖండించింది. తనపై రేవంత్‌ రెడ్డి చేసిన సవాళ్లపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించి ప్రతి సవాల్‌ విసిరారు. 'తేదీ, సమయం ఆయనే చెబితే నేను కారు డ్రైవింగ్‌ చేస్తా. ఇద్దరం మూసీ నది ఒడ్డుకు పోదాం' అని హరీశ్ రావ్‌ చాలెంజ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bandi Sanjay: గ్రూప్‌ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్‌ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?


మూసీ ప్రాజెక్టుపై ప్రెస్‌ మీట్‌ పెట్టి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూనే తీవ్రంగా తప్పుబట్టారు. 'డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్దం' అని తెలిపారు.

Also Read: Tamil Anthem: 'ద్రవిడ' పదం ఉచ్ఛరించని గవర్నర్.. ముఖ్యమంత్రి సహా తమిళ ప్రజల ఫైరూ


 


'సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్.. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధం. ముందు మూసీ నిర్వాసితుల వద్దకు.. ఆ తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అక్కడే కూర్చొని మాట్లాడుదాం' అని రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు సవాళ్లు విసిరారు. ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మల్లన్నసాగర్‌లో ఇండ్లు కోల్పోయిన వారికి 4000 ఇండ్లు కట్టించి ఇచ్చాం' అని వివరించారు. 'దేశంలో అత్యుత్తమ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ కట్టించాం. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం 121 గజాల ఇండ్లు ఇవ్వాలని ఉంది, కానీ కేసీఆర్ 250 గజాలలో 4 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మల్లన్నసాగర్‌లో కట్టించి ఇచ్చారు' అని గుర్తు చేశారు.


'మూసీ నది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదని ముఖ్యమంత్రి చెప్పారు. విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్క్ టైం స్క్వేర్‌ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌజ్‌ను తలదన్నే హైరైజ్ భవనాలు, లండన్‌లోని థేమ్స్ నది మీదున్న బ్రిడ్జిని మించిన బ్రిడ్జిలు చూపెట్టారు. ప్రపంచ దేశాల్లో ఉన్న రివర్ ఫ్రంటులన్నీ ఒక్క దగ్గర వేసి దంచి నూరి ఏఐలో వేసి తీసినట్టున్న పంచవన్నెల దృశ్యాలను చూపించాడు' అంటూ రేవంత్‌ ప్రెస్‌మీట్‌ను హరీశ్ రావు ఎద్దేవా చేశారు.


'నది పునరుజ్జీవనం అంటే సజీవంగా.. గలగలపారే స్వచ్ఛమైన జలాలు. సుందరీకరణ అంటే మీరు చూయించిన హైటెక్కులు, అద్దాల ఏఐ బిల్డింగులు' అని హరీశ్ రావు తెలిపారు. 'ముఖ్యమంత్రి మాట కరెక్టా? కాంట్రాక్టు తీసుకున్న కంపెనీల కన్సార్షియం చూపించింది కరెక్టా?' అని సందేహం వ్యక్తం చేశారు. మరి ఈ ఫ్రంట్ ఏంది. దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏంది? అని నిలదీశారు. మీకు దమ్ముంటే మేము మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని చాలెంజ్‌ చేశారు.


'నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు.. రాజకీయాలు చేస్తున్నావు. చిత్తశుద్ధి ఉంటే.. నల్లగొండ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల ద్వారా మూసీలో చేరకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి' అని రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సూచించారు. మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదని.. బుల్డోజర్ విధానాలు.. మీ రియల్ ఎస్టేట్ దందాలకు తాము వ్యతిరేకమని హరీశ్ రావు స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి