CM Revanth Reddy Key Decision on Traffic: ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే ఆ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని రోడ్లు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతాయి. సీఎం వెళ్లే వరకు అన్ని వాహనాలు నిలిచిపోవాల్సిందే. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళుతున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామన్నారు. తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా.. ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని  చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన  చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల కష్టాలను తెలుసుకోకుండా ఇంట్లో ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు రేవంత్ రెడ్డి.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడంపై పోలీస్ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆమెకు అదే ఉద్యగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే.. వెంటనే ఉద్యోగం తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి ఏమైనా అవరోధాలు ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగంలోకి చేర్చుకోవాలని ఆదేశించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారని.. ఇదే నియమం నళినికి ఎందుకు వర్తించదన్నారు. ఆమెకు ఎందుకు అన్యాయం జరగాలని.. ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే అదే హోదాలో ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 


బాధ్యతలు చేపట్టిన అధికారులు..


హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. HMDA ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని చెప్పారు. అనంతరం మూసీ రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి.. కార్పొరేషన్ అధికారులతో సమావేశం అయ్యారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు చేపట్టారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సంస్థ డైరెక్టర్లతో విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. 


Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు


Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి