Moosi River: మూసీ నదిపై తగ్గేది లేదు అంటున్న రేవంత్ సర్కార్..
Moosi River: మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదనే విషయం స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Moosi River: ఎవరేమనుకున్న రేవంత్ రెడ్డి మూసీ రివర్ విషయంలో సర్కారు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అంతేకాదు మూసీ పరివాహాక ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకొని నివసిస్తోన్న వాళ్లకు దగ్గరలోనే భూమి సహా మంచి పరిహారం ఇస్తామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి హైదరాబాద్ అభివృద్దికి ప్రభుత్వంతో కలిసి రావాలన్నారు.
ఈ సందర్ంగా తొలి దశ టెండర్లపై సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో బాపూఘాట్ అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు చేపడుతామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని బాపూఘాట్‌లో నెలకొల్పుతామన్నారు. పటేల్, అంబేద్కర్ విగ్రహాల తరహాలోనే మహాత్ముడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు.
కేబుల్ బ్రిడ్జి, బరాజ్ ఏర్పాటు చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి 7వేలకోట్ల రూపాయలతో నీటిని ఉస్మాన్ సాగర్‌కు నీళ్లు మళ్లిస్తామన్నారు. అక్కడి నుంచి హిమాయత్ సాగర్‌కు పంపనున్నారు. ట్రంక్‌లైన్ కోసం వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. బాపూఘాట్ వద్ద ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతామన్నారు. ఇప్పటికే రూ. 140 కోట్ల రూపాయలతో DPR తయారీకి ఆదేశాలిచ్చామని తెలిపారు. నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter