Redistribution of Districts in Telangana: తెలంగాణ ఆవిర్భావం సమయంలో పది జిల్లాలు ఉండగా.. పరిపాలన సౌలభ్యం పేరుతో 33 (Districts in Telangana)కు పెంచింది కేసీఆర్ సర్కార్. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటు చేశారు. ములుగు, నారాయణపేట, గద్వాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం, జగిత్యాల, వనపర్తి జిల్లాలు విస్తీర్ణంలో చిన్నవిగా ఉన్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఒక పద్దతిని అవలంభించలేదన్న విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త మండలాలను ఏర్పాటు చేశారే తప్ప.. మండలానికి కార్యాలయం అందుబాటులో లేక ఎక్కడో ఒక చోట భవనానికి, గదికి బోర్డు తగిలించి కార్యాకలాపాలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికే  ములుగు జిల్లా పరిమితమైంది. కొన్ని జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక జిల్లాలో మూడు, నాలుగు ZPTC లు మాత్రమే ఉన్నాయి. ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అవి కూడా మూడు నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆ ముగ్గురు, నలుగురు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిదులు 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది.


కాంగ్రెస్ (Congress Govt) అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి  గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జిల్లాల ఏర్పాటు అంశంపై మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాల విభజనన (Redistribution of Districts)పై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తరువాత వెంటనే ప్రకటన చేయమని.. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చిస్తామని చెప్పారు. ఆ రిపోర్ట్‌పై ప్రజా అభిప్రాయం తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు.


జిల్లాల పునర్విభజనలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు చిన్న జిల్లాల్లో రెండు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా అవసరమైన చోటే కొత్త రెవెన్యూ డివిజన్లను, మండలాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ పాత బస్తీతో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాలను కలపి మరో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. ఇక సికింద్రాబాద్‌ నుంచి కంటోన్మెంట్ ప్రాంతాన్ని మరో జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఏర్పడిన మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలను ఏర్పాటు అశాస్త్రీయంగా విభజించారని భావిస్తోన్న తెలంగాణ సర్కారు.. పునర్విభజించాలని భావించాలని తెలుస్తోంది. 


Also read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..


Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook