Telangana New CM Revanth Reddy: ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో కొత్త సీఎం ఎవరు అనేది తేలిపోయింది.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి పేరును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. సోమవారం నుంచి కసరత్తు చేసిన ఏఐసీసీ పరిశీలకులు.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానానికి పంపించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రేవంత్ పేరును ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్ర నాయకులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పిలుపునివ్వగా ఆయన ఫ్లైట్‌లో వెళుతున్న క్రమంలోనే ముఖ్యమంత్రి ప్రకటన వచ్చింది. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నా.. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికే అవకాశం కల్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. పార్టీలోని సీనియర్ల అందరికీ న్యాయం జరుగుతుంది. అంతా ఒక టీమ్‌గా పనిచేస్తారు. డైనమిక్ లీడర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఎల్లుండి రేవంత్ ప్రమాణ స్వీకారం ఉంటుంది.." అని కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని తన నివాసంలో ప్రకటించారు. 


తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రకెక్కారు. కాంగ్రెస్ నుంచి తొలి సీఎంగా ఆయన సరికొత్త చరిత్ర లిఖించారు. 2014, 2018ల్లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి పనిచేశారు. టీపీసీసీ చీఫ్ సీఎం కాలేరనే ఆనవాయితీకి కూడా రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. మాటలే కాదు చేతల్లోనూ దూకుడు, మంచి వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారే తీరు, పదునైన రాజకీయ వ్యూహాలు, విమర్శించిన వారిని సైతం మచ్చిక చేసుకునే నైజంతో రేవంత్ మాస్‌ లీడర్‌గా ఎదిగారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు దీటుగా ప్రసంగాలు ఇస్తూ.. కేటీఆర్, హరీష్ రావు వంటి లీడర్లను గట్టి కౌంటర్లు ఇచ్చారు. అన్ని వెరసి రేవంత్‌ను సీఎం పీఠంపై కూర్చొబెట్టాయి.


రేవంత్ రెడ్డి కుటుంబ నేపథ్యం..


తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. దివంగత కాంగ్రెస్ జైపాల్ రెడ్డి దగ్గరి బంధువు గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు నైమిషారెడ్డి ఏకైక సంతానం.


Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు


Also Read: Vivo T2 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌..Vivo T2 Pro 5Gపై రూ.22,550 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి