Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి పులి చంపేస్తోంది.  రోజురోజూకు పడిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజూకు పెరుగుతోంది. పది డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతలగాలులు ఇదే విధంగా కొనసాగితే వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో అత్యల్పంగా  కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్‌ శివారు నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మెుదటిసారి. చివరగా 2017లో ఆదిలాబాద్‌లో 6.8 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.  ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. 


ఇదిలా ఉంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్ లోని చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో చలితీవ్రత పెరిగింది. చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.


Also Read: Traffic New Rules: ట్రాఫిక్ కొత్త రూల్స్.. రాంగ్ సైడ్‌కి 1700, ట్రిపుల్ రైడింగ్ 1200 బాదుడే బాదుడు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook