తెలంగాణలోని నిర్మలమైన నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి జరిగిన మత ఘర్షణ కారణంగా భైంసా రక్తమోడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలోని శివాజీనగర్ లో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్త ఉద్రిక్త పరిణామాలకు దారి తీసింది.  ఫలితంగా రెండు వర్గాల్లో  ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కర్రల దాడిలో రెండు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. 


అర్థరాత్రి విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాల్లోని అల్లరి మూకలను చెదరగొట్టారు. పరిస్థితి  అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం భైంసాలో భద్రతను ఎస్పీ శశిధర్ రాజు పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు. భైంసా చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. 


మరోవైపు భైంసాలో ఇవాళ ఉదయం డీఐజీ ప్రమోద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా శివాజినగర్‌లో పరిస్థితిని ఆయన సమీక్షించారు. 24 గంటల పాటు భైంసాలో కర్ఫ్యూ విధించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..