Telangana: తెలంగాణా పీసీసీ కొత్త ఛీఫ్ ఎవరనే సస్పెన్స్ దాదాపుగా తొలగినట్టే కన్పిస్తోంది. ఎవరెన్ని చెప్పినా..కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముందుగానే ఆ అభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దుబ్బాక ఉప ఎన్నిక ( Dubbaka Bypoll ), జీహెచ్ఎంసీ ఎన్నికల్లో( Ghmc Elections ) పరాజయం అనంతరం టీపీసీసీ ఛీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రసకందాయంగా మారింది. అధ్యక్ష పదవి రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రేవంత్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా విన్పించాయి. టీపీసీసీ అధ్యక్షుడి (Tpcc president ) ఎంపికలో ఏకాభిప్రాయం కోసం అధిష్టానం ప్రయత్నించింది. పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్డ్ మాణిక్యం ఠాగూర్ అందరు నేతల్ని కలిసి అభిప్రాయం తెలుసుకున్నారు. మూడ్రోజుల పాటు తెలంగాణలో ఉండి..దాదాపుగా 160 మంది కాంగ్రెస్ నేతల్ని కలిశారు. అధిష్టానానికి తన నివేదికను ఇచ్చారు. 


పార్టీలో సీనియర్లను కలుపుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy venkata reddy ) మాణిక్యం ఠాగూర్‌ని కలిసి అధ్యక్ష పదవి గురించి చర్చించారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి ( Revanth reddy )పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో ఏకాభిప్రాయసాధన కోసమే మాణిక్యం ఠాగూర్‌ని పంపించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఆ దిశగా సమాచారం వచ్చినట్టు కూడా సమాచారం. కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్..రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డికి  పీసీసీ అధ్యక్ష పీఠం దక్కుతోందని తెలుస్తోంది.  


పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఢిల్లీ వెళ్లగానే..సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ రేసులో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిని ఢిల్లీకి పిలిపించారని సమాచారం. రేవంత్ రెడ్డి అభ్యర్ధిత్వంపై అసమ్మతి వ్యక్తం చేసే అవకాశముంది కాబట్టి..ముందుగా వీరిని బుజ్జగించడం కోసమే ఢిల్లీ పిలిపించినట్టు  తెలుస్తోంది. 


Also read: Telangana: నాన్ అగ్రికల్చరల్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం