Telangana Politics: తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ మళ్లీ షురూ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు నిలిచిపోయిన చేరికలను పరుగులు పెట్టించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీపీసీసీ చీఫ్‌ పార్టీ పెద్దలతో ఇదే విషయమై చర్చించగా.. దీనికి హైకమాండ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో త్వరంలోనే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను మళ్లీ ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్‌ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత తరుణంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కనీసం 15 మంది ఎమ్మెల్యేలను లాగి.. బీఆర్‌ఎస్ ఎల్పీని హాస్తం పార్టీలో విలీనం చేసుకునేలా టీపీసీసీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan : హోం మంత్రి పదవి నుంచి అనితను తప్పుకోమన్న పవన్, ఇక హోం మంత్రిగా పవన్ ఖాయమా..!
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడంతో చేరికలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల జంపింగ్ అంశం స్పీకర్‌ పరిధిలో ఉండటంతో పార్టీ మారాలని భావించిన నేతలు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తేగానీ పార్టీ మార్పుపై ఆలోచిద్దాం అనే ధోరణిలో మరికొందరు లీడర్లు ఉన్నారు. ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేటు వేస్తే తమపై కూడా చర్యలుంటాయనే కొందరు నేతలు ఆలోచిస్తున్నారట.. అందుకే వారంతా ఆచీతూచీ అడుగులు వేస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 
 
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్లాన్‌ మాత్రం మరోలా ఉందట.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌  చర్యలు తీసుకోకముందే బీఆర్ఎస్‌ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. అలా చేయడం ద్వారా ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకొవచ్చనే ఆలోచన చేస్తోందట. అందుకే అధికార పార్టీ మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌పై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్‌ నేతల చేరికలను కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. ఎమ్మెల్యే సంజయ్‌ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌ ఓ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని డిసైడ్‌ అయ్యిందట. భవిష్యత్తులో పార్టీలోకి ఎవరైనా నేతలను చేర్చుకునే సమయంలో ఆ నియోజకవర్గం నేతల అభిప్రాయాలు సైతం తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.. ఇందుకు టీపీసీసీ చీఫ్‌ ఓకే చెప్పినట్టు గాంధీ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
ప్రస్తుతం చేరికల అంశంపై టీపీసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. పలు నియోజకవర్గాల్లో తమకున్న పరిచయాల ద్వారా నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను లాగి కారు పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తునట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతజిల్లాలో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడికి తొలుత పార్టీ కండువా కప్పే ఆలోచనలు టీపీసీసీ ఉన్నట్టు తెలుస్తోంది. పాలమూరు జిల్లాలో ఈ ఇద్దరు నేతలను చేర్చుకోవడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్‌ను తిరిగి మొదలు పెట్టామనే సంకేతాల్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇవ్వాలని అనుకుంటోందట. 

మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి సైతం టీపీసీసీకి టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ మాజీ మంత్రి.. తనకున్న పరిచయాలతో అధికార పార్టీలో చేరాలని భావిస్తున్నారట. అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరికలపై ఆయన ఓ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. తనకు ఓ నామినేటెడ్‌ పోస్టు ఇస్తే.. అధికార పార్టీలో చేరేందుకు సిద్దమని ఓపెన్ ఆఫర్‌ ప్రకటించారట. ఇదే విషయమై టీపీసీసీ చీఫ్‌ పార్టీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. త్వరలోనే ఈ మాజీ మంత్రి అధికార పార్టీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. మొత్తంగా కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ తీయాలని అధికార పార్టీ యోచిస్తోందట.. అయితే అధికార పార్టీలోకి జంపింగ్‌లను ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎలా అడ్డుకుంటుంది అనేది మాత్రం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. 


Also Read: Pawan kalyan: బీహార్ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం.. అసలేం జరిగిందంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook