Pawan kalyan: బీహార్ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం.. అసలేం జరిగిందంటే..?

Pawan kalyan Varahi brigade wing: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల సనాతన ధర్మంను కాపాడాలని కూడా చాలా పలు సభలల్లో కూడా కీలక ఉపన్యాసాలు చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. హిందు ధర్మం కాపాడటం కోసం  ఎంతదూరమైన వెళ్తానని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా కూడా దుమారంగా మారిన విషయం తెలిసిందే.

1 /6

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల తిరుమల లడ్డు వివాదం రెండు తెలుగు స్టేట్స్ లలో కాకుండా.. దేశంలో కూడా పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈక్రమంలో అప్పట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సనాతన ధర్మంను కాపాలుకోవాలంటు కూడా పిలుపునిచ్చారు.  

2 /6

ఇతర మతాలు, వర్గాలలో ఏదైన జరిగితే అందరు ఒక్కటౌతారని, కానీ హిందు ధర్మం, సనాతన ధర్మంను కాపాడుకునేందుకు ఎందుకు  వెనక్కు వెళ్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాన్ సనాతన ధర్మం కోసం చేస్తున్న ప్రసంగాలు పొలిటికల్ సర్కిల్స్ లలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా.. సనాతన ధర్మం కోసం.. పటిష్టమైన బాధ్యత అవసరమని పవన్ అన్నారు.

3 /6

ఇదిలా ఉండగా.. తాజాగా జనసేన పార్టీలో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో.. పవన్ ఇటీవల నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  

4 /6

ఇదిలా ఉండగా..తాజాగా,పవన్ కళ్యాన్ చేసిన నరసింహా వారాహి గణం విభాగాన్ని బీహార్ లోని  బీజేపీ నేతలు స్వాగతించినట్లు తెలుస్తొంది. తాజాగా పవన్ సనాతన ధర్మ పరిరక్షణ ప్రకంపనలు బీహార్  రాజకీయాల్లో.. అధికార విపక్షాల,మధ్య రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు.  

5 /6

పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలను బీహార్ మంత్రి నీరజ్ బాబు స్వాగతించినట్లు తెలుస్తొంది.  దీనివల్ల సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వార్తలలో నిలిచాయి. దీనిపై బీహర్ సీఎం నితిష్ కుమార్ మాత్రం ఎలాంటి కామెంట్లు చేయలేదు.

6 /6

మరోవైపు.. బీహార్ బీజేపీ నేతల వ్యాఖ్యలను.. ఆర్జేడీ నేత మ్రత్యుంజయ్ తివారి తీవ్రంగా విమర్శించారు. వీరంతా నకిలీ సనాతనీయులు అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ప్రస్తుతం బీహార్ లో కూడా పవన్ సనాతన ధర్మం వ్యాఖ్యలు రాజకీయంగా  కాక రేపుతున్నాయని చెప్పుకొవచ్చు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x