హైదరాబాద్: అసెంబ్లీ రద్దును సవాలు చేస్తూ  హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్యేలకు కనీస సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేయడాన్నిసవాల్ చేస్తూ కాంగ్రెస్ మహిళా నేత డీకే అరుణ సోమమారం పిటిషన్ వేశారు. కేవలం కేబినెట్ నిర్ణయంతోనే  అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని పిటిషన్ లో ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా సభను రద్దు చేయడం సభ్యుల హక్కులను కాలరాయడమేనని పిటిషన్ లో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరైక కారణం లేకుండా అర్థాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసిన నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను కూడా డీకే అరుణ తన పిటిషన్‌లో సవాల్ చేసినట్లు తెలిసింది. ఆమె తరపున న్యావాది నిరూప్ రెడ్డి సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ లంచ్ తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది.


హైకోర్టులో ఇప్పటికే ఓటర్ల జాబితా అవకతవకలపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ సాగుతోంది. తాజా పిటిషన్లపై ఈసీ కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. కాగా దీనిపై  విచారణను బుధవారం జరగనుంది. ఈ క్రమంలో అసెంబ్లీ రద్దును సవాలు చేస్తూ డీకే అరుణ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం