Madhu Yashki On Priyanka Gandhi: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  తెలంగాణ వస్తే దుబాయ్.. బొగ్గుబాయి ఉండదని కేసీఆర్ చెప్పారని కానీ గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డ్ కూడా తీసేసింది ఈ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. కథర్‌లో వేల మంది కార్మికులను బయటకి పంపిస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రశ్నించారు. కథర్ నుంచి వచ్చే కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పి.. ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'తెలంగాణ లిక్కర్ పాలసీ పంజాబ్, ఢిల్లీ పాలసీనే కాపీ కొట్టింది. బేవరేజ్ కూడా వాళ్లకు సంబంధించిన వాళ్లకు కట్టబెట్టారు. అత్యధిక లిక్కర్ సేల్ తెలంగాణలోనే ఉంది. డ్రగ్స్ అమ్మకాల్లో తెలంగాణ టాప్ అయింది. డ్రగ్స్ ఎపిసోడ్ ఏమైందో అర్థం కాలేదు..' అని మధుయాష్కీ అన్నారు.


కాంగ్రెస్ ప్రతి ఎన్నిక సీరియస్‌గానే తీసుకుంటుందని.. అందరూ కలిసి పని చేసినా వరుసగా ఓడిపోవడం విచారకరమని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదనే దానిపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధన ప్రభావం ఒక్కటే ఉండదని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ త్వరలోనే తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలు ఉంటాయన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో నాయకుల ఐక్యత కనపడిందని.. ఇది శుభ పరిణామం అని అన్నారు. పార్టీ క్రమశిక్షణకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


'తెలంగాణ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ జరగాలి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసేసిందే బీజేపీ. 2013లో పది వేల కోట్ల రుణాలు మాఫీ చేసి.. ఫ్యాక్టరీ ఓపెన్ కావడానికి కాంగ్రెస్ కృషి చేసింది. ఇప్పుడేదో బీజేపీ చేసినట్లు ప్రచారం చేసుకుంటుంది. ప్రధాని వచ్చినప్పుడే.. టీఆర్ఎస్ గొడవ చేస్తుంది. ఢిల్లీ వెళ్లినప్పుడు మోదీ కాళ్ల మీద పడి వస్తారు. ఇక్కడికి ప్రధాని వస్తుంటే నాటకాలు ఆడుతున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్ఎస్, బీజేపీ పంచాయతీ. ఫోన్ ట్యాపింగ్‌లో దొంగలే దొంగ అన్నట్లు ఉంది. గవర్నర్‌కి అనుమానం ఉంటే హోంశాఖకి ఫిర్యాదు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని.. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు..' అని ఆయన ఆరోపించారు.


Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం.. ఇద్దరిని ఢీకొట్టిన ట్రక్.. ఒకరు మృతి   


Also Read: Rajiv Gandhi Murder Case: సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు విడుదల  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి