Renuka Chowdhury: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో ఉద్రిక్త వాతావరణ కనిపించింది. రాజ్‌భవన్‌కు వెళ్తున్న కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈసందర్భంగా పోలీసులకు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నన్ను అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులు వేశారు. తనను చుట్టుముట్టిన పోలీసులపై మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి చొక్కా పట్టుకున్నారు. మహిళలను మహిళా పోలీసులు అరెస్ట్ చేయాలని ఫైర్ అయ్యారు. దీంతో ఒక్కసారి అక్కడ యుద్ధం వాతావరణం తలపించింది. దీనిపై సిరీయిస్ అయిన ఆమె పోలీస్ కాలర్‌ పట్టుకున్నారు. అప్రమత్తమైన మహిళా పోలీసులు రేణుకా చౌదరిని అరెస్ట్ చేశారు. తన పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఈసందర్భంగా పోలీసుల తీరుపై మండిపడ్డారు. తనను ఆపేందుకు మీరెవరని ప్రశ్నించారు. తాను ఈ రోడ్డుకు ట్యాక్స్‌ కట్టాని అన్నారు. ఆందోళన మధ్యే రేణుకా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Also read: Minister KTR Tweet: ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ మధ్య ఏముంది..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!


Also read:Congress Protest: కాంగ్రెస్ ఛలో రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం..నేతల అరెస్ట్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook