తెలంగాణలో కరోనా వైరస్(CoronaVirus) కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అస్వస్థతకు గురై వీహెచ్(V Hanumatha Rao) కరోనా లక్షణాలతో శనివారం అపోలో ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు చేయగా కోవిడ్19 పాజిటివ్‌(CoronaVirus Positive for V Hanumantha Rao)గా నిర్ధారించారు. ప్రస్తుతం వీహెచ్ (VH) అదే ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. పెద్ద వయసు వారు కావడంతో ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులు వీహెచ్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వలయాకార సూర్యగ్రహణం.. నేడు ఖగోళంలో అద్భుతం


తొలుత బీజేపీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు కోవిడ్19(COVID-19) బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత గూడూరు నారాయణ రెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా వీహెచ్‌కు కోవిడ్19 పాజిటివ్‌గా తేలడంతో ఆయన ప్రైమరీ కాంటాక్ట్‌ (నేరుగా కలిసిన వ్యక్తులు) అయిన వారు అప్రమత్తమయ్యారు. టెస్టులకు వెళ్లాలా, లేక హోమ్ క్వారంటైన్‌లో ఉండాలన్న దానిపై యోచిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ