Paidi Rakesh Reddy: బీజేపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ లు..
Paidi Rakesh Reddy: ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీకి భారీ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో రెండు పిటిషన్ లు దాఖలయ్యాయి.
Vinay Kumar reddy and Jeevan Reddy Alligation On BJP MLA Paidi Rakesh Reddy: తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో, సమర్పించిన అఫిడవిట్ లో అనేక విషయాలు దాచిపెట్టారంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రెండు వేర్వేరు పిటిషన్ లు దాఖలు చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రతి ఎన్నికల బరిలో ఉండే ప్రతిఅభ్యర్థి తనకు ఉన్న ప్రాపర్టీస్, అప్పులు, పోలీసు కేసుల వంటివి అన్ని సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తారు. దీనిలో పైడిరాకేష్ రెడ్డి.. హైదరాబాద్ లో ఉన్న వ్యవసాయ ప్రాంతంలో నిర్మించిన గోడౌన్ లపై సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ నేత రాకేష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
అదే విధంగా పైడి రాకేష్ రెడ్డి.. ఆయనపై ఉన్న కేసుల వివరాలను అఫిడవిట్ లో పొందుపర్చలేదని, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సపరేట్ గా మరో పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం ఇది నిజామాబాద్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మంచి విధేయుడని కూడా ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా.. ఆర్మూల్ లో గత ఎన్నికలలో పైడి రాకేష్ రెడ్డి, జీవన్ రెడ్డిల మధ్య నువ్వా.. నేనా.. అన్న విధంగా పోటీ జరిగింది. అనూహ్యంగా రెండో స్థానంలో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రాకేష్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అదే విధంగా అనేక సందర్భాలలో పైడిరాకేష్ రెడ్డి తరచుగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పదేళ్లపాటు ఆర్మూర్ ను దోచుకున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఆర్మూర్ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిందేమీ లేదని, ప్రజలను అన్యాయం చేసి భూకబ్జాలకు పాల్పడ్డారంటూ పైడి రాకేష్ రెడ్డి అనేక మార్లు బహిరంగంగా విమర్శించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యవహరం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter