Celebrity Astrologer Venu Swamy Fire On Youtuber On His Death Thumb: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారారు. గతంలో ఆయన దగ్గర జాతకాలు చెప్పించుకుని, శాంతులు చేయించుకున్న వారంతా ఓవర్ నైట్ లో స్టార్ డమ్, పొలిటికల్ లో మంచి కెరియర్ ను పొందారంటూ కూడా ఆయన అనేక వీడియోలలో వెల్లడించారు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి, సమంతా నాగచైతన్య డైవర్సీ, కేసీఆర్ ఎన్నికలలో ఓటమి పాలవ్వడం, రేవంత్ రెడ్డి అనూహ్యంగా సీఎం అవుతారని చెప్పనంటు వంటి అనేక వీడియోలు వార్తలలో నిలిచాయి. దాదాపు ఆయన చెప్పిన ప్రకారం అనేక సంఘటలను జరిగాయని కూడా సోషల్ మీడియాలో తరచుగా ప్రచారం జరుగుతుంటుంది.
Read More: Snake Swallows Itself: బాప్ రే.. తన తోకను తానే మింగేస్తున్న పాము.. వైరల్ గా మారిన వీడియో..
ఇక విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమ వ్యవహారంపై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వేణు స్వామి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొందరు జ్యోతిష్యులు తనకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. కావాలని తాను మాట్లాడిన ప్రతివిషయాన్ని ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. ప్రతివిషయాన్ని కాంట్రవర్సీకి గురిచేస్తున్నారని అన్నారు. అదే విధంగా ఈమధ్యకాలంలో ఒక జ్యోతిష్యులు ఏకంగా తన చావు గురించి థంబ్ నెయిల్ పెట్టాడని అన్నారు.
సదరువ్యక్తి.. కేవలం పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేసినట్లు కొట్టిపారేశారు. అతను ఎన్నో వీడియోలు చేశాడని, ప్రతివీడియోలు కేవలం వందలలో, వేలలో మాత్రమే వ్యూస్ వచ్చిందని , తాను ఎప్పుడు చనిపోతానో అన్న విధంగా పెట్టుకున్న థంబ్ కు మాత్రం.. లక్షల్లో వ్యూస్ వచ్చిందన్నారు. తాను పబ్లిసీటీ ఉన్న జ్యోతిష్యుడని, ఒక సెలబెల్ పర్సన్ అని అన్నారు.
కొందరు తనమీద ఇలాంటి థంబ్ నెయిల్స్, కాంట్రవర్సీ టాపీక్ మాట్లాడుతూ ఫెమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అదే విధంగా సోషల్ మీడియా ట్రోలర్స్, మీమర్స్ వల్ల తనకు వచ్చిన నష్టం ఏంలేదని వేణుస్వామి తెల్చిచెప్పారు. ఇదిలా ఉండగా.. గతంలో మహేష్ బాబు గుంటూరు కారం మూవీ కూడా ఇలాంటి ఫెక్ రివ్యూల వల్లనే హిట్ కాలేదన్నారు. ఇటీవల విడుదలైన.. ఫ్యామిలీ స్టార్ మూవీకి కూడా అదే విధంగా కొందరు కావాలని నెగెటివ్ రివ్యూలు ఇస్తువిజయ్ దేవర కొండను కావాలనే టార్గెట్ చేశారని వేణుస్వామి అన్నారు. సినిమాల విడుదలకు ముందే నెగెటివ్ రివ్యూలు, ఇలాంటి వాళ్ల మౌత్ పబ్లిసిటీ వల్ల జనాలు ఇంపాక్ట్ అవుతున్నారని వేణుస్వామి స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter