Attack On Harish Rao Camp Office Siddipet: రుణమాఫీ విషయంపై మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ముదిరిన వివాదం మరింత తారాస్థాయికి చేరింది. ఇప్పటికే హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు.. తాజాగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై దాడికి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసులోకి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. క్యాంప్‌ గేట్లు బద్ధలు కొట్టి ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు. అంతేకాకుండా ఆఫీసుపైకి ఎక్కి హల్‌చల్ చేశారు. జై కాంగ్రెస్ అంటూ నినదాలు చేస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని రెండు పార్టీల కార్యకర్తలను బయటకు పంపించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Jio 999 Recharge Plan: జియో నుంచి కొత్త ప్లాన్, అన్‌లిమిటెడ్ డేటా 15 ఓటీటీలు ఉచితం


ఈ ఘటనపై హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి.. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం అని అన్నారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని విమర్శించారు. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


హరీశ్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి పిరికిపందల చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అని మాట్లాడుతుంటే.. ఆయన పార్టీ తెలంగాణలో నఫ్రత్ కా దుకాణ్ అంటూ హింసను ప్రేరేపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా రాహుల్ గాంధీ వల్లే వేస్తున్న మొహబ్బత్ కా దుకాణ్ అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రకటించుకున్న రాహుల్ గాంధీ చేస్తున్న రాజ్యాంగ విలువల పరిరక్షణ ఇదేనా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.


Also Read: Shraddha Kapoor: మహేష్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రభాస్ భామ శ్రద్ధా కపూర్ .. అసలు మ్యాటర్ ఇదే..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.