MLC FIGHT: తెలంగాణలో ఎమ్మెల్సీ ఫైట్.. పోటీకి కాంగ్రెస్ నై!
Jeevan Reddy: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది..! త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశావాహులు ఇప్పటికే లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీలో అన్ని చోట్ల పోటీ చేసేందుకు నేతలు నిరాకరిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లోనే పోటీ చేస్తామని అంటున్నారు. మిగతా కోటాలో పోటీకి నై అంటున్నారు. నేతలు ఎందుకలా అంటున్నారు..!
Jeevan Reddy: తెలంగాణలో కొద్దిరోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికల సమరం షురూ కాబోతోంది. ఈసారి ఉపాధ్యాయ, టీచర్, గవర్నర్, ఎమ్మెల్యే కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి గ్రాడ్యుయేట్, టీచర్ కోటాలో పోటీకి అధికార పార్టీ నేతలు నిరాకరిస్తున్నట్టు సమాచారం. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగి చేతులు కాల్చుకోవడం ఎందుకని అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు వెనకాడుతున్నారట. కానీ ఎమ్మెల్యే కోటాలో తమకు ఓకే అన్నట్టు చెబుతున్నారట. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో అయితే గెలుపు నల్లేరుమీద నడకగా ఉంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమచారం..
ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఆశావహులు అందరూ కూడా తమకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ మాత్రమే కావాలని హైకమాండ్‌ను కోరుతున్నట్టు సమాచారం. తాము ఎన్నికలకు సిద్ధంగా లేమని పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కూడా మళ్లీ పోటీ చేయడానికి విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. కొద్దరోజుల క్రితమే టీపీసీసీ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డినే అభ్యర్ధిగా నిలబెడతామని పార్టీ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ప్రస్తుతం టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఎందుకు నిరాకరిస్తున్నారే చర్చ గాంధీ భవన్‌లో జోరుగా సాగుతోందట. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలకు కొత్త కొత్త పదవులు దక్కుతున్నాయి. కానీ టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఎన్నికల్లో పోటీకి నేతలు ఎందుకు వెనకాడుతున్నారని ఆరా తీస్తున్నారట. అయితే నేతలు పోటీ వెనుకు అసలు కారణాలు తెలిసి పార్టీ పెద్దలు సైతం షాక్ అవుతున్నారట. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలి. అంతేకాదు భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అయినా గెలుస్తామని గ్యారెంటీ లేదు.. కాబట్టి పోటీలో నిలిచి చేతులు కాల్చుకోవడం ఎందుకు చాలా మంది ఆశావాహులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఎమ్మెల్యే కోటాలో అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఉంటారు. అందువలన ఈజీగా గెలవొచ్చని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా తమకు ఎమ్మెల్యే కోటా అయితే ఓకే.. కానీ మిగతా కోటా అయితే నాట్ ఓకే అని మెజారిటీ అశావాహులు పార్టీ పెద్దలకు తేల్చి చెబుతున్నారట. అయితే ఉన్నవే 5 సీట్లు కావడంతో ఎంతమందికి సీట్లు ఇస్తామని పార్టీ పెద్దలు సైతం ముఖం మీదే చెబుతున్నట్టు తెలిసింది. అందరూ ఇలాగే మాట్లాడితే.. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలో చెప్పాలని ఆశావాహులను పార్టీ పెద్దలే కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్సీ కోటాలో సీటు ఇవ్వకపోతే కనీసం నామినేటెడ్ పోస్టు అయినా ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను కోరుతున్నారట. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సీట్ల విషయంలో పార్టీలో విచిత్రమైన పరిస్ధితులు ఉండటంతో పార్టీ పెద్దలు కూడా ఆచీతూచీ అడుగులు వేద్దాంలే అనే దోరణిలో ఉన్నారని తెలుస్తోంది.
Also Read: BJP TELANGANA: మిషన్ తెలంగాణ.. టీ బీజేపీకి రిపేర్ వర్క్!
Also Read: KT Rama Rao: తప్పుడు కూతలు కూస్తోన్న రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.