KCR Deeksha Diwas: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సన్నాసి ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ సహా ఏ విషయాల్లోనూ రేవంత్ రెడ్డి సక్రమంగా చేయలేదని మండిపడ్డారు.
Also Read: Padi Kaushik Reddy: మళ్లీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉగ్రరూపం.. బంజారాహిల్స్ సీఐతో రచ్చరచ్చ
కేసీఆర్ ఆమరణ దీక్ష సందర్భంగా దీక్షా దివాస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేశారు. ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. '2024లో కేసీఆర్ గాయం, కవిత అరెస్ట్‌తో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. దాన్ని కోలుకుని తిరిగి పుంజుకుంటాం' అని ప్రకటించారు. ఈ సంద్భంగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.
Also Read: Revanth Reddy: 'మూసీ'లో కిషన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రక్షాళన చేస్తా
'కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం.? రేవంత్ రెడ్డి సన్నాసి ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు. తప్పుడు కూతలు కూస్తోన్న రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రుణమాఫీ పాక్షికంగా మాత్రమే జరిగిందని.. ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్తోన్న దాని ప్రకారం రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలుస్తోందని చెప్పారు. డబ్బు సంచులతో దొరికిన దొంగ రేవంత్.. దొంగనే దొంగ అన్నట్లు రేవంత్ వ్యవహారం ఉందని మండిపడ్డారు.
'గురుకుల విద్యార్థులను బీఆర్ఎస్ ఎవరెస్ట్ ఎక్కించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాడె ఎక్కిస్తుంది' అని గురుకులాల్లో కలుషిత ఆహారంపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్ ఉందని నిరూపిస్తే.. అది రేవంత్ రెడ్డికే రాసిస్తాం అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు తిప్పలు.. తెలంగాణకు రూ.లక్షల కోట్లు అప్పులు మిగిలాయని విమర్శించారు. జోసెఫ్ గోబెల్ ఆదర్శంగా ముఖ్యమంత్రి, మంత్రులు పాలన చేస్తున్నారని తెలిపారు.
'కాంగ్రెస్ పాలనలో ఎనుములు బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు. తెలంగాణ రైజింగ్ కాదు.. రేవంత్ బ్రదర్స్ రైజింగ్.. తెలంగాణ ఫాలింగ్' అంటూ ఏడాది ఉత్సవాలను కేటీఆర్ అభివర్ణించారు. భవిష్యత్‌లో రేవంత్ బ్రదర్స్ ఆస్తులు అదానీని దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకే కళంకం తీసుకొచ్చాడని మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టుడు.. దేవుళ్ళ మీద ఒట్లు తప్ప రేవంత్ చేసిందేమీ లేదని తెలిపారు.
'తెలంగాణ రైజింగ్ ఎట్లనో సీఎం రేవంత్ చెప్పాలి' అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఏడాది పాలనలో ఇబ్బందులు పడ్డ కాంగ్రెస్ బాధితులతో తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారింది అని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మరో నాలుగేళ్లు పోరాటానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అప్పుల మీద కాదు.. రేవంత్ రెడ్డి తప్పుల మీద ప్రజల్లో చర్చ జరగాలని సూచించారు. 2 లక్షల ఉద్యోగాల హామీనిచ్చిన రేవంత్, రాహుల్ గాంధీ బండారం బయటపెడతామని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.