Kishan Reddy: తెలంగాణలో కమలం పార్టీ రూట్ మార్చినట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతం కోసం ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం.. ఇప్పటికే అర్భన ఏరియాలో మంచి ఓటు బ్యాంకు కలిగియున్న కాషాయపార్టీ ఇప్పుడు రూరల్ ఓటర్లకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోందట. ఇప్పటికే పార్టీ నిర్వహిస్తున్న మెంబర్ షిప్ డ్రైవ్‌కు మంచి స్పందన రావడంతో విస్తరించాల్సిన సమయం అసన్నమైందని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. కొద్దినెలలుగా కమలం పార్టీ సభ్యత్వ నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 35 లక్షల సభ్యత్వాలు నమోదైనట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఆశించనన్నీ సీట్లు రాలేదు. కానీ. పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకున్న పార్టీ ఏకంగా 8 ఎంపీ సీట్లను గెలచుకుంది. అంతేకాదు రాష్ట్రంలో ఆ పార్టీకి 35 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత అంతేస్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించడంతో ... ఆ టార్గెట్‌ను కూడా కమలనాథులు పూర్తి చేశారు. దాంతో రాష్ట్రంలో వీలైనన్నీ పోలింగ్ బూత్‌లకు కొత్త కమిటీలు వేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 36 వేల పోలింగ్ బూత్ ఉండగా.. కనీసం 25 వేల బూత్‌లకు కొత్త కమిటీలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని సమాచారం.
ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలోపేతంపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది కమలం పార్టీ. ఈ వర్క్‌షాపులో తామేంత సీరియస్‌గా ఉన్నామో చెప్పేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారట. కొంచెం కష్టపడితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి అధికారం పక్కా అని చెబుతున్నారట. మరోవైపు రూరల్‌లో మాత్రమే పార్టీకి మంచి ఇమేజ్ ఉంది. కాబట్టి.. అర్భన్‌లోనూ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారట. అందుకుగానూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఓ కమిటీ సైతం వేసినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ రాష్ట్రంలో బూత్ కమిటీల నియామకం కోసం తీవ్ర కసరత్తే చేస్తోందట. ఈనెలలోనే దాదాపు 25 వేల బూత్ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని పార్టీ నేతలు టార్గెట్‌గా పెట్టుకుని పనిచేస్తున్నారని టాక్. అంతేకాదు కాంగ్రెస్ సర్కార్‌పై కషాయం పెద్దలు మరో పోరాటానికి సైతం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై చార్జ్‌షీట్ సైతం విడుదల చేసింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్‌ను ఆయన విడుదల చేశారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ వాళ్లు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆనాడు బీఆర్‌ఎస్, ఈ రోజు కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను మోసగించాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ లేఖ రాసి మరీ మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడీ ఆరు అబద్ధాలు.. 66 మోసాలంటూ మండిపడ్డారు.
మొత్తంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారట. రాష్ట్రంలో గులాబీ పార్టీ ఎలాగు డీలా పడింది.. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పోటీలో తామే ఉన్నామని విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే పార్టీకి సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ సమయంలో కమలం పార్టీకి రిఫైర్ చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. చూడాలిమరి కమలం పార్టీ రిఫైర్ వర్క్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో..!
Also Read: Padi Kaushik Reddy: మళ్లీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉగ్రరూపం.. బంజారాహిల్స్ సీఐతో రచ్చరచ్చ
Also Read: BRS POLITICS: కారులో ఉక్కపోత.. బీఆర్‌ఎస్‌కు మరో లీడర్ గుడ్‌బై?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.