Jagga Reddy on Inter Results: తెలంగాణలోని ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే విద్యార్థుల పక్షాన పోరాటం ఉద్ధృతం చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రెండేళ్లుగా ఇంటర్‌ బోర్డు తీరు వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అయిన నేపథ్యంలో ఆయన నగరంలోని నాంపల్లి ఇంటర్ బోర్డ్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.



"4.5 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్ష రాస్తే 2.35 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. చాలా రాష్ట్రాల్లో కొవిడ్ కారణంగా విద్యార్థులను పాస్‌ చేశారు. ఇక్కడ మాత్రం విద్యార్థులు చనిపోతున్నా ఎందుకు పాస్ చేయడం లేదు?ఫెయిల్ అయిన వారంతా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే" అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 


కరోనా కారణంగా అనేక మంది పేద విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోయారని.. అలాంటి విద్యార్థులే పరీక్షల్లో తప్పారని జగ్గారెడ్డి అన్నారు. అయితే అలాంటి పేద విద్యార్థులను పట్టించుకోకపోతే ఎలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్తాపంతో ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.   


Also Read: High Court: తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలకు హైకోర్టు ఆదేశాలు


Also Read: Lockdown: ఆ తెలంగాణ గ్రామంలో సెల్ఫ్ లాక్‌డౌన్-ఒమిక్రాన్ కేసు బయటపడటంతో గ్రామస్తుల అలర్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి