National green Tribunal: రెండు నెలల్లో నివేదిక సమర్పించాలంటూ నోటీసులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటీషన్ దాఖలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( Greater Hyderabad Municipal Corporation ) ( GVMC ) పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై ( illegal constructions ) తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటీషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయని..చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నాయంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి ( Congress Mp Revanth reddy ) ఇటీవల విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి...అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ( National green tribunal, chennai ) లో పిటీషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటీషన్ పై చెన్నై ఎన్జీటీ స్పందించింది.
పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సహా డిఎల్ఎఫ్ ( DLF ) , మైహోమ్ ( Myhomes ) సంస్థలకు నోటీసులు జారీ చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కేంద్ర పర్యావరణ శాఖ రీజినల్ ఆఫీసర్, చెరువుల పరిరక్షణ కమిటీ లతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి...రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని చెన్నై ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.
పుప్పాల గూడ లో నాలాను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశారని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. జివో 111 సహా బిల్డింగ్ రూల్స్ 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలు నిర్మించారని రేవంత్ రెడ్డి ఎన్ జి టి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక, రాజకీయ బలం ఉన్న బడా సంస్థలు డిఎల్ఎఫ్, మైహోంమ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని పిటిషన్ లో పేర్కొన్నారు. Also read: Asaduddin Owaisi: బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా?: ఎంఐఎం అధినేత సూటి ప్రశ్న