Congress Party Counter to Minister KTR: తెలంగాణలో ఎన్నికల వేళ గ్రూపు-2 విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చగా.. అసలు ఆమె ఎలాంటి పోటీ పరీక్ష రాయలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయింది. ప్రవళిక  గ్రూప్ 1, 2,3,4 దరఖాస్తులను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. ఒక ఆడబిడ్డ చనిపోతే ఆమెపై ఇంత దారుణంగా నిందలు మోపి రాజకీయం చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. అసలు ప్రవళిక తెలంగాణకు చెందిన అమ్మాయి కాదని సైతం బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తారేమో..? అని అనుమానం వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో యువతి ప్రవళిక ఆత్మహత్య చేసున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆదివారం మంత్రి కేటీఆర్ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రవళిక గ్రూప్స్ పరీక్షకు దరఖాస్తు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నగా.. ప్రవళిక గ్రూప్ 1, 2,3,4 దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ పోస్టు చేసి కౌంటర్ ఇచ్చింది.


“ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం తపిస్తున్న డ్రామా రావు అడ్డంగా దొరికిపోయాడు. అసలు గ్రూప్స్‌కే అప్లై చేయలేదని వాదించిన డ్రామా రావు మీరేం సమాధానం చెప్తారు. ఒక ఆడబిడ్డ చనిపోతే ఆమె పై ఇంత దారుణంగా నిందలు మోపి రాజకీయం చేస్తారా..? నిరుద్యోగుల్లో మీ పై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. #DramaRao #ByeByeKCR” అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.


"ఓ ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంది.. రాష్ట్ర యువత అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి న్యాయం కోరుతుంటే.. ఈ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఏమయ్యారు..? ఎందుకు స్పందించలేదు...?" అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో ప్రశ్నించింది. అంతేకాదు అసలు ప్రవళిక తెలంగాణకు చెందిన అమ్మాయి కాదని సైతం బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తారేమో..? అని ఎద్దేవా చేసింది.


ఇది కూడా చదవండి : Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఎండలు-ఉక్కపోత నుంచి ఉపశమనం


ఇది కూడా చదవండి : Israel Hamas War: హమాస్ ఉగ్రవాదులను ఏరివేతకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వప్రయత్నాలు..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..