Venkat, Mahesh Elected as MLCs: ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి దక్కాయి. బల్మూర్‌ వెంకట్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌లు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారని అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. రెండు స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో వారిద్దరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వీరి ఎన్నికతో శాసనమండలిలో కాంగ్రెస్‌ బలం పెరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి నుంచి వెంకట్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ధ్రువపత్రాలను అందుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వెంకట్ మాట్లాడుతూ.. 'అతి చిన్న వయసులో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. తొమ్మిదేళ్ల పాటు నాతోపాటు ప్రతి ఉద్యమంలో భాగమైన ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు కృతజ్ణతలు. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటా' అని పేర్కొన్నారు. ఇక మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పందిస్తూ.. 'ఎమ్మెల్సీగా ఎన్నికవడం సంతోషంగా ఉంది. నా సేవలు గుర్తించి పార్టీకి అవకాశం కల్పించింది. పార్టీలో నిజాయతీగా పని చేస్తే పదవులు అవే వస్తాయనడానికి నేనే నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండలిలో కృషి చేస్తా' అని తెలిపారు.


బలం పెరిగినా.. 
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కడంతో మరింత జోష్‌ వచ్చింది. శాసనమండలిలో ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీకే అత్యధిక స్థానాలు ఉన్నాయి. బిల్లులు పాసవ్వాలంటే మండలిలో కాంగ్రెస్‌కు అంతా సంఖ్యా బలం లేదు. ఇప్పుడు రెండు స్థానాలు చేరడంతో కొంత బలం పెరిగింది. అయినా బిల్లులు ఆమోదించుకోవడానికి ఈ బలం చాలదు. త్వరలోనే గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ అంశం న్యాయ పరిధిలో ఉంది. ఆ అంశం బీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా వస్తే కాంగ్రెస్‌కు కలిసొస్తుంది. మరి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Rahul Gandhi No Entry: అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ.. రాహుల్‌ గాంధీకి చేదు అనుభవం

Also Read: Ayodhya: రామనామం కణ కణంలో ఉంది: అయోధ్యలో తన్మయత్వానికి లోనైన ప్రధాని మోదీ
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook