D Srinivas: శీనన్న ఇకలేరు.. ఐ విల్ మిస్ యూ డాడ్.. అంటూ ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్..
MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
Congress senior leader Dharmapuri Srinivas passes away: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారు జామున చనిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీపీగా ప్రెసిడెంట్ గా పనిచేశారు. తెలంగాణ విభజన తర్వాత 2015 లో బీఆర్ఎస్ లో చేరి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ బీఆర్ఎస్ లో ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. డీఎస్ కొన్నినెలల పాటు బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికలకు ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీల్ చేయిర్ మీద కుమారుడు.. ధర్మపురి సంజయ్ తో కలిసి గాంధీభవన్ కు వచ్చారు. మరల కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
ఈ క్రమంలో కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో ఈ రోజు (జూన్29) న కన్నుమూశారు. ఆయన అకాల మరణం పట్ట కాంగ్రెస్ నేతలు, సీనియర్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే డీఎస్ మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. డీఎస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్ర వేసుకున్నారని, ఎల్లప్పుడు కూడా హుందాగా ఉండేవారని సీఎం చంద్రబాబు అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసేవారని అన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబానికి తమ ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం లు కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
ఎమోషనల్ అయిన ధర్మపురి అర్వింద్..
తన తండ్రి డీశ్రీనివాస్ అకాల మరణం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా.. ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘ ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు..
I WILL MISS YOU DADDY !
నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.!
ఎదురొడ్డు, పోరాడు,భయపడకు అని నేర్పింది మా నాన్నే..
ప్రజలను ప్రేమించు,ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే.
నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు
ఎప్పటికీ నా లోనే ఉంటావు..’ అంటూ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో డీఎస్ మరణంపట్ల పార్టీలకు అతీతంగా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ పార్థివ దేహన్ని తొలుత హైదరాబాద్ లోని ఆయన ఇంటికి తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత.. వి.హనుమంతరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. అదే విధంగా మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి మొదలైన నేతలంతా తమసంతాపం వ్యక్తం చేశారు.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
ఆదివారం అంత్యక్రియలు..
డీఎస్ పార్థీవ దేహన్ని హైదరాబాద్ లో ఆయన ఇంట్లో రాజకీయ నాయకులు, అభిమానుల సందర్శన కోసం ఉంచారు. పార్లమెంట్ సమావేశాల కోసం అర్వింద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆతర్వాత డీఎస్ భౌతిక కాయాన్ని నిజామాబాద్ కు తరలిస్తారని సమాచారం. ఆదివారం రోజు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి