Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ప్రియాంక గాంధీతో సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి..తనను అవమానిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. రేవంత్‌ తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతోపాటు ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చండూరులో సమావేశం, చెరుకు సుధాకర్ చేరిక అంశాలను లేఖలో వివరించారు. ఈసందర్భంగా తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెంకట్‌రెడ్డి ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకోలేనని లేఖలో స్పష్టం చేశారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికపై సమావేశంలో చర్చించారు.


పార్టీలో నెలకొన్న పరిణామాలపై భేటీలో మంతనాలు జరిపారు. ఈ భేటీలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతలు మధుయాష్కి గౌడ్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. త్వరలో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో పార్టీలన్నీ జోరు పెంచాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశాయి. ఈక్రమంలోనే మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.


సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్‌ సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ముఖ్య నేతల సమావేశానికి సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకాలేదు. ఈనేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రాష్ట్రంలో  ఉన్న పరిస్థితులను వివరించారు. గతకొంతకాలంగా ఆయన పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఐతే వాటిని ఆయన ఖండించారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. తాజాగా ముఖ్య నేతల సమావేశానికి హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పార్టీ మారారు. త్వరలో మునుగోడుకు ఎన్నిక జరగనుంది.


Also read:Kishan Reddy: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అందుకేనా..కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..! 


Also read:AP 10th Class: ఏపీలో చదువుల విప్లవం..10వ తరగతి పరీక్షా విధానంలో మరో కీలక మార్పు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి