తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు  అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో తెలంగాణలో ఖైరతాబాద్ గణేషుని సందడి అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి..  స్వామివారికి నిత్య పూజలు చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఆ సందడి మళ్లీ మొదలు కాబోతోంది. ముందుగా ఖైరతాబాద్ గణేషుని ప్రతిమ నిర్మాణం కోసం పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 18న కర్రపూజతో పనులు ప్రారంభించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఆ రోజు ఏకాదశి కాబట్టి లాంఛనంగా కర్రపూజ నిర్వహించి పనులకు అంకురార్పణ చేస్తారు. ఈ నెల 18న సాయంత్రం ఐదు గంటలకు కర్రపూజ నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ వెల్లడించింది. 


[[{"fid":"185520","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కర్రపూజలో పాల్గొనేందుకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది. ఐతే పూజకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించింది. అందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌  చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయంపై పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..