గురుకులంలో కరోనా కలకలం.. 27 మంది విద్యార్థినులకు పాజిటివ్
గురుకులంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఖమ్మం జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు కరోనా సోకింది.
TS News: ఖమ్మం జిల్లా(Khammam district)లోని వైరా గురుకుల పాఠశాల(gurukul school)లో కరోనా(Covid-19) కలకలం రేపింది. 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్(Covid-19 Positive)గా నిర్దారణ అయ్యింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది.
దీంతో ప్రిన్సిపల్ లక్ష్మి విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్(Coronavirus) సోకినట్లు తేలింది. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల(Students)ను కూడా ఇళ్లకు తీసుకెళుతున్నారు. ఇటీవలె నల్గొండ జిల్లా(Nalgonda District) కొండమల్లేపల్లిలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో పది మందికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరు టీచర్లు ఉన్నారు.
Also Read: తెలంగాణలో 3,657 కరోనా యాక్టివ్ కేసులు
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు(Corona Cases) తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు. అంతా సవ్యంగా ఉందని తల్లిదండ్రులు అనుకునేలోపే... మళ్లీ ఇప్పుడు కరోనా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook