COVID-19 cases: హైదరాబాద్‌: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నేడు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 762 కేసులు నమోదయ్యాయి. తాజాగా విడుదలైన కోవిడ్-19 హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇవాళ ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్‌తో మరణించిన వారి సంఖ్య మొత్తం 339కి చేరింది. ఇవాళ 1,013 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 19,205 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 12,680 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus ) సంఖ్య 32,224 కి చేరింది. ( Also read: TS secretariat: వాస్తు పేరుతో దారుణం: రేవంత్‌ రెడ్డి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"187446","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


నేడు నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా రంగా రెడ్డి జిల్లాలో 171 ( Ranga Reddy Dist ), మేడ్చల్ జిల్లాలో 85, సంగా రెడ్డి జిల్లాలో 36, నల్గొండ జిల్లాలో 32, కామారెడ్డి జిల్లాలో 23, మెదక్ జిల్లాలో 22,  ఖమ్మం జిల్లాలో 18, మంచిర్యాల జిల్లాలో 17, ఆదిలాబాద్ జిల్లా, 14, మహబూబ్‌నగర్ జిల్లా, సూర్యాపేట జిల్లాల్లో 14 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


ఇవే కాకుండా కరీంనగర్ జిల్లా, నారాయణ్ పేట్ జిల్లాలో 9 చొప్పున, నిజామాబాద్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లాలో 8 చొప్పున, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7, పెద్దపల్లి జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో 6 చొప్పున, వరంగల్ అర్బన్ జిల్లాలో 5, సిద్ధిపేట జిల్లాలో 4, జనగాం జిల్లాలో 3, గద్వాల, వనపర్తి, ఆసిఫాబాద్, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..