MP Revanth Reddy: హైదరాబాద్: వాస్తు పేరుతో 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చివేయడం దారుణమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM K. Chandrashekar Rao) పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదును కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన సీఎం, సీఎస్‌లను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ వాస్తు కోసం రాత్రికి రాత్రే సచివాలయాన్ని కూల్చడం దారుణమన్నారు. తన కొడుకును సీఎం చేయడం కోసమే కూలుస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి వేదికైన ఆలయాన్ని, మసీదును కూల్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఎంఐఎం, బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. Also read: సచివాలయం కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేకులు
కోర్టును తప్పుదారి పట్టించి వందల కోట్లను వృథా చేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి మంత్రివర్గ ఆమోదం లేదని తాము వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించిందని ఆయన గుర్తుచేశారు. అసలు పర్యావరణ అనుమతులు లేకుండా పాత సచివాలయాన్ని ఎలా కూల్చుతారంటూ ప్రశ్నించారు. కూల్చిన శిథిలాలను ఎక్కడ పడేస్తారో చెప్పలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రేవంత్ పేర్కొన్నారు. Also read: Covid-19: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష
హైదరాబాద్‌లోని పలుచోట్ల ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగసంఘాల నాయకులు కొంతమంది కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos