హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. కాగా తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా మహమ్మారి ప్రభావంతో మార్చి 21 వరకు జరిగాయి. అయితే కరోనా వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతుండడంతో హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 30 వరకు పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos 


ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం విధించిన జనతా కర్ఫ్యూ.. మరోవైపు కరోనా ఆందోళనల నేపథ్యంలో సీఎం కేసీఆర్ 23 నుండి 31 మార్చి వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మిగతా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మంగళవారం నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ ని త్వరలో ప్రకటించనున్నట్లు రాష్ట్ర విద్య శాఖ తెలిపింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone