COVID-19 cases in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, శుక్రవారం రోజున ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 1,658 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ ( Greater Hyderabad ) తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 44, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 41, సంగారెడ్డి జిల్లాలో 20, నల్లగొండ జిల్లాలో 13, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 12 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు ( Coronavirus ) నిర్ధారణ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )


ఆ తర్వాత మహబూబాబాద్‌ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో 6, వనపర్తి 5, భద్రాద్రి కొత్తగూడెం- 4, సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 3 చొప్పున, నిర్మల్‌, ఖమ్మం జిల్లాల్లో 2 చొప్పున, కరీంనగర్‌, జోగుళాంబ గద్వాల, ములుగు, జగిత్యాల, వరంగల్‌ అర్బన్‌, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం నాటి కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి సంఖ్య ( Coronavirus cases in Telangana ) 20,462 మందికి చేరుకుంది.


( Also read: Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat )


తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ ( COVID-19 health bulletin ) బులెటిన్ ప్రకారం కరోనావైరస్‌ కారణంగా శుక్రవారం రాష్ట్రంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 283 మందికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 1,126 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 1,04,118 కరోనా పరీక్షలు ( Coronavirus tests) చేయగా, 20,462 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..