COVID-19 in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం 127 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ మరునాడైన శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగి 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 cases) నమోదయ్యియి. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 116 జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోనే గుర్తించగా.. మిగిలిన వాటిలో రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5, వరంగల్‌ జిల్లాలో 3, మేడ్చల్‌ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలో 2, కరీంనగర్‌ జిల్లాలో 2, అదిలాబాద్‌ జిల్లాలో 2, మంచిర్యాలలో 1 కేసు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనావైరస్ బారిన పడిన స్థానికుల కేసుల సంఖ్య 2842 కి చేరింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు తిరిగొచ్చిన వారిలో మొత్తం 448 మందికి కరోనా సోకింది. వీరితో కలిపి మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3290 కి చేరింది. TS SSC exams 2020: 10వ తరగతి పరీక్షలపై కొనసాగుతున్న సస్పెన్స్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో కరోనాతో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 8 మంది చనిపోయారు ( COVID-19 deaths ). దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 113 కి చేరుకుంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,627 గా ఉంది. ప్రస్తుతం 1550 మంది కరోనా పేషెంట్స్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. SSC exams : 10వ తరగతి పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు )


 హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..